శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:46 IST)

కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

kavitha
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా వైరస్ సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. 
 
గడిచిన రెండు రోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఐసోలేషన్‌ లేదా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.