గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మా డాడీని చూస్తే మోడీకి దడ... అందుకే నన్ను చిట్టెలుకను చేశారు.. కవిత

kavitha
తన తండ్రి, తెరాస, అధినేత, తెలంగాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి దడ అని అదుక ఆయన్ను నియంత్రించేందుకు నన్ను బలపశువును చేయాలని మోడీ-షా ద్వయం సరికొత్త ఆటకు తెరతీశారని తెరాస మహిళా నేత, ఎమ్మెల్యే కె. కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన పేరును తెరపైకి తీసుకుని రావడానికి ప్రధాన వేరే కారణాలు ఉన్నాయన్నారు. 
 
అసలు బీజేపీ టార్గెట్ తాను కాదన్నారు. తండ్రి కేసీఆర్ అని చెప్పారు. ఇందుకోసం తనను బోనులో ఎరగా వేశారన్నారు. ఫలితంగా బోనులో ఈ చిట్టెలుకను బంధించారని ఆమె చెప్పుకొచ్చారు. తన తండ్రి కేసీఆర్‌తో ముప్పు ఉందని బీజేపీ నేతలు గ్రహించారని అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను తమపైకి ఉసిగొల్పుతుందని తెలిపారు. 
 
ముఖ్యంగా, తన తండ్రి కేసీఆర్‌కు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి దడ అని అన్నారు. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని అన్నారు. బీజేపీవి అన్ని బ్యాక్ డోర్ పాలిటిక్స్ అని చెప్పారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూవున్న సైన్యాన్ని కొడతారని, అలా తన తండ్రితో నేరుగా ఢీకొనే సత్తా లేకే తనను ఎరగా వేశారన్నారు. 
 
అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన పేరును తెరపైకి తెచ్చారన్నారు. ఈ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణల గురించి అస్సలు ఏమాత్రం పట్టించుకోవద్దని కుటుంబ సభ్యులకు చెప్పానని, ఇదే విషయాన్ని తన తండ్రి కేసీఆర్‌కు కూడా చెప్పానని కవిత వెల్లడించారు. 
 
పైగా, లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. గిట్టని పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బీజేపీకి కొత్తకాదని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్నది అదేనని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలవుతుందన్నారు.