శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (18:46 IST)

సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్

sonia gandhi
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 
 
సోనియాకు కరోనా వైరస్ సోకడం ఇది మూడోసారి. గత నెలలో కూడా ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత నేషనల్ హెరాల్డ్ ఆర్థిక లావాదేవీల కేసులో ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాకు కూడా వైరస్ సోకింది.  
 
గత జూన్ మొదట్లో కూడా సోనియా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారినపడ్డారు. కోవిడ్ అనంతరం సమస్యల కారణంగా జూన్ 12న శ్రీగంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకుని జూన్ 20న డిశ్చార్జి అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కూడా హాజరయ్యారు.