సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (15:20 IST)

ఇంటి అల్లుడిని మెడ పెట్టి గెంటేసి వుంటే.. ఎన్టీఆర్ ప్రధాని అయ్యేవారు..

rk roja
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సీఎం జగన్ ప్రభుత్వం పేరు మార్చిన తర్వాత వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్ళీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు తీరుఫై రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
 
ఎన్టీఆర్ బతికుండగా ఆయన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని.. అప్పుడు ఆయన్ని బాగా చూసుకొని.. అన్నం పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని రోజా అన్నారు. ఎన్టీఆర్‌ను తమ ఇంటి అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుని కుటుంబ సభ్యులు మెడ పెట్టి బయటకు గెంటేసి ఉంటే బాగుండేదన్నారు. అలా చేసివుంటే గనుక ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవారంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
బతికుండగానే ఎన్టీఆర్‌ను చంపేసిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు. రాజధాని విషయంలో కోర్టులో గెలిచామని రాజధాని రైతులు సంబరపడుతున్నారు.. అయినప్పటికీ రాజధానిలు మూడు ఉంటాయని.. పాలన విశాఖ నుంచే జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి రోజా. 
 
అయినప్పటికీ నిజాన్ని గుర్తించక రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికే అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తున్నారంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అసలు రైతులు ఎక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్ వాచ్‌లు పెట్టుకొని తొడలు కొడతారా అంటూ ప్రశ్నలు సంధించారు. అయినాయి అసలు ఆ పార్టీలో ఏంటో ఆడవాళ్లు తొడలు కొడతారు.. మగవాళ్ళు ఏడుస్తారు.. జంబలకడిపంబ తరహాలో ఆ పార్టీ తయారయిందంటూ ఎద్దేవా చేశారు.