ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (13:31 IST)

ఏపీ మంత్రి విశ్వరూప్‌కు తీవ్ర అస్వస్థత - ముంబైకు తరలింపు

minister viswaroop
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.విశ్వరూప్ మరోమారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ముంబైకు తరలించారు. ఆయన శుక్రవారం మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు ముంబైకు తరలించారు. మంత్రి విశ్వరూప్ గుండె సంబంధిత సమస్యలతో విశ్వరూప్ బాధపడుతున్నట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. 
 
ఈ నెల 2వ తేదీన దిగవంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం... మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు విశ్వరూప్ అస్వస్థతకు గురవడంతో ఆయనను ముంబై తరలించారు.