శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (14:43 IST)

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్

Mark Boucher
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు తన ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్‌ను ఎంపిక చేసింది. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తున్న ఈ జట్టు యాజమాన్యం ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న మహేళ జయవర్థనేను తమ ప్రాంఛైజీ పెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్‌గా నియమించగా, ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌ను నియమించింది. ఈ మేరకు ముంబై జట్టు యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. 
 
అలాగే, మార్క్ బౌచర్ నియామాకాన్ని కూడా ఆ జట్టు యజమాని, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా నిర్ధారించారు. జట్టుకు అద్భుతమైన విలువను జోడిస్తాడంటూ కీర్తించారు. బౌచర్ అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు 
mark boucher
కాగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా నియమితుడవడం పట్ల మార్క్ బౌచర్ స్పందించాడు. ముంబై జట్టులో మేటి ఆటగాళ్లకు కొదవలేదని, ఆ జట్టు విలువను మరింత పెంచేందుకు కృషి చేస్తానని తెలిపాడు. ముంబై ఇండియన్స్ వంటి గొప్ప జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వెల్లడించారు.