శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:26 IST)

రంగమార్తాండ కోసం బ్ర‌హ్మానందం, ప్ర‌కాష్ రాజ్ సంగీత క‌చేరీ

Brahmanandam and Prakash Raj
Brahmanandam and Prakash Raj
ద‌ర్శ‌కుడు  కృష్ణవంశీ చిత్రాలంటే కుటుంబ‌క‌థా చిత్రాల‌కు పెట్టింది పేరు. వైవిధ్య‌మైన అంశాల‌ను తీసుకుని అంతే రీతిలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిళితం చేసే ఆయ‌న ఈసారి మ‌న అమ్మానాన్న‌ల క‌థే `రంగమార్తాండ` అంటూ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే భిన్న‌మైన రీతిలో ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణన్‌ ఆర్ట్ పొటోలు ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌మోష‌న్ చేశారు. మంచి స్పంద‌న వ‌చ్చింది.
 
Brahmanandam, Prakash Raj, Anasuya, krishna vamsi
Brahmanandam, Prakash Raj, Anasuya, krishna vamsi
తాజాగా ఈరోజు చిత్రానికి సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌కాష్ రాజ్ ఆర్మోనియం పెట్టెతో సాధ‌న చేస్తుండ‌గా బ్ర‌హ్మానందం గాయ‌కుడిగా త‌న విద్య‌ను ప్ర‌ద‌ర్శించే విధంగా వుంది. వీరిని ఆస‌క్తిగా ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప‌రిశీలిస్తున్నారు. మ‌రో చోట వారితోపాటు అన‌సూయ‌కూడా వుంది. ఆమె చిన్న‌పాప‌తో ఏదో చెబుతున్న స‌న్నివేశంగా తెలియ‌జేస్తుంది. 
 
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో రూపొందుతోంది ఈ రంగమార్తాండ. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.
 
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటిస్తున్నారు.