ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (16:38 IST)

అల్లు అర్జున్ ఆవిష్క‌రించిన బ్రేక్ అవుట్ ట్రైల‌ర్‌

Allu Arjun, Raja Gautham and others
Allu Arjun, Raja Gautham and others
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ ' బ్రేక్ అవుట్'. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశం రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు.
 
రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో ఈ చిత్ర కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగా రివిల్ చేశాడు దర్శకుడు. హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న వారికి వంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. గ్యారేజ్ లో వంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడనేది ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు .
 
ట్రైలర్ లో రాజా గౌతమ్ ఫెర్ఫామెన్స్ టెర్రిఫిక్ గా వుంది. అతని లుక్, మేకోవర్ ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ట్రైలర్ ఉన్నతంగా వుంది. జోన్స్ రూపర్ట్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ మరో ఆకర్షణగా నిలిచింది. మోహన్ చారీ కెమరాపనితనం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.  చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు.