ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (13:03 IST)

తగ్గేదేలే అంటోన్న అల్లు అర్జున్..

Allu Arjun, fans
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూయార్క్ లో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ఇండియా డే పరేడ్ కార్యక్రమానికి భార్య స్నేహారెడ్డి తో కలసి హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా 'గ్రాండ్ మార్షల్' అవార్డును ఇచ్చి అక్కడి వారు సత్కరించారు. తనకు గ్రాండ్ మార్షల్ అవార్డును ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు.
 
సినిమా, వినోద ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు.  ఇక అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే.. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలుసుకున్నాడు.
 
ఇద్దరూ కలసి పుష్ప మాదిరిగా తగ్గేదేలే అన్న సంకేతంగా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫొటోలకు పోజు లిచ్చారు. న్యూయార్క్ మేయర్ ను కలుసుకోవడం పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గౌరవం చూపించిన మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ కు ధన్యవాదాలు. తగ్గేదేలే! అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.