గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (16:30 IST)

సైమా అవార్డ్స్... SIIMA 2021: అగ్రస్థానంలో పుష్ప

Pushpa
దేశంలోని నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటోంది. 2021 యేడాదికి గాను సైమా దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించింది.
 
ఇందులో అల్లు అర్జున్.. పుష్పతో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఫుష్ప’ మూవీ ఏకంగా 12 నామినేషన్స్ దక్కించుకుంది. 
 
ఇందులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకత్వం సహా 12 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
 
ఇక ‘అఖండ’ మూవీ ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఫైట్స్, ఫోటోగ్రఫీ సహా 10 విభాగాల్లో ఈ సినిమా నామినేషన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 
 
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ సినిమా ఉత్తమ నూతన నటీనటులుగా ప్రతి నాయకుడిగా ఈ సినిమా 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. 
 
జాతి రత్నాలు మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు ఉత్తమ కమెడియన్‌తో పలు విభాగాల్లో 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.