శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:52 IST)

హాలీవుడ్‌‍కు అల్లు అర్జున్.. హాలీవుడ్ దర్శకుడితో మంతనాలు

allu arjun
"పుష్ప" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఇపుడు ఈ చిత్రం సీక్వెల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న అల్లు అర్జున్... హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. 
 
దీనికి కారణం పుష్ప చిత్రంలో బన్నీ నటనకు హాలీవుడు దర్శకులు, ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారట. దీంతో తాజా సమాచారం ప్రకారం బన్నీకి హాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. "పుష్ప"లో ఆయన నటనకు మనసు పారేసుకున్న హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు.. బన్నీతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. 
 
ఈ మేరకు బన్నీ కోసం తన కథలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ని క్రియేట్‌ చేశారట. ఈ క్రమంలోనే ఇటీవల బన్నీ న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారని తెలుసుకుని మరీ.. ఆయన్ని ప్రత్యేకంగా కలిసి.. తన సినిమా గురించి చర్చించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.