గురువారం, 12 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:52 IST)

ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...

singam dhoni
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది జరుగనున్న 2023 ఐపీఎల్ టోర్నీలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, గత 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సేవలకు దూరమైన విషయం తెల్సిందే. ఆ సీజన్‌లో రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
దీంతో 2023లో మాత్రం మళ్లీ గట్టి పోటీదారుడుగా ఉండాలని జట్టు మేనేజ్మెంట్ మంచి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా, కెప్టెన్‌ బాధ్యతలను ధోనీకి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.