శనివారం, 9 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (11:53 IST)

మాజీ కెప్టెన్ ధోనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Dhoni
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనకు సోమవారం నోటీసులు జారీచేసింది. అమ్రపాలి గ్రూపు కేసులో ఆయనకు ఈ నోటీసులు పంపించాల్సిందిగా ఆదేశించింది. అమ్రపాలి కంపెనీ తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ గత 2019లో మార్చి నెలలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే, ఈ ఆర్థిక మధ్వర్తిత్వం చేయడానికి మాజీ న్యాయమూర్తిని కోర్టు మధ్యవర్తిగా నియమించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించారు. 
 
సోమవారం న్యాయమూర్తులు యూయు లలిత్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పెండింగులో ఉన్న ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్‌ల గురించి తెలియజేసింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి, కొనుగోలుదారులకు ఇళ్లను అందజేసేందుకు కోర్టు రిసీవర్ను నియమించినట్లు పేర్కొంది.
 
కాగా, గతంలో అమ్రవాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అమ్రపాలి గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ధోనీకి చెల్లింపులు జరగలేదన్నది ప్రధాన ఆరోపణగా ఉంది.