గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (15:00 IST)

ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరంతా వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేస్తున్నారు. వీరికి పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొలీజియం నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యాంసుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.
 
37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికే మహబూబ్‌ సుబానీ షేక్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయనతోపాటు, ఈ ఏడుగురి పేర్లకూ కేంద్రం ఆమోదముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది.