శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

ys jagan
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. వీరి ఎంపికపై ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత పిదప ముఖ్యమంత్రి జగన్ వారి పేర్లను ఖరారు చేశారు. 
 
విశాఖ - శ్రీకాకుళం - విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్, అనంతపురం - కడప - కర్నూలు స్థానానికి అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నెపూస గోపాల్ రెడ్డి కుమారుడు రవీంద్ర రెడ్డి, చిత్తూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్లను ఆయన ఖరారు చేశారు.