శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (13:43 IST)

13న విశాఖలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

ys jagan
ఈ నెల 13వ  తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో పర్యటించించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వాహన మిత్ర లబ్దిదారులకు చెక్కుల పంపిణి చేస్తారు. సీఎంవో వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 11.05 గంటలకు ఆంధ్రా విశ్వవిద్యాలయం కాలేజీ మైదానానికి చేరుకుని, 10 నిమిషాల పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్ళను సందర్శిస్తారు. 
 
ఆ పిమ్మట వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్దిదారులతో ఫోటోలు దిగి, 11.45 నుంచి 12.15 వరకు ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.20 గంటల నుంచి లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. తిరిగి 12.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక వైకాపా నేతలతో భేటీ అవుతారు. 1.20 గంటలకు తిరిగి విజయవాడుకు పయనమవుతారు.