సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (16:31 IST)

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు.. అది ముగిసి చాప్టర్ : హోం శాఖ

andhra pradesh map
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని, అది ఒక ముగిసిన అధ్యాయం అని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో రామ్మోహన్ రావు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. దీనికి మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ, 'ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచాం. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించిందన్నారు. 
 
15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చాం. కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య 28 సమావేశాలు ఏర్పాటు చేశాం, అన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తుందని అని వివరించారు. ప్రత్యేక హోదా అంశం ఓ ముగిసిన అధ్యాయం అని అన్నారు.