గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (14:46 IST)

భారత మార్కెట్లోకి Poco M5... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M5
Poco M5
షావోమీ నుంచి పోకో పేరుతో ఎం5 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. 4జీ ఫోనుగా మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్‌తో ఈ ఫోను విడుదలైంది. ఈ ఫోన్ ఎల్లో, ఐసీ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో భాగంగా.. సెప్టెంబర్ 13న ఫోన్ అమ్మకానికి రానుంది. ముందుగా కొనుగోలు చేసే వారికి ఆరంభ వెర్షన్ ను రూ.10,999, హై ఎండ్ వెర్షన్‌ను రూ.12,999కే ఇవ్వనున్నట్టు పోకో ప్రకటించింది. 
 
ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. 
కాకపోతే బాక్స్ లో 22.5 వాట్ చార్జర్ ను పోకో అందించనుంది. 
సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,499. 
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.14,499. 
6జీబీ ర్యామ్ వెర్షన్‌లో వర్చువల్‌గా ర్యామ్‌ను మరో 2జీబీ మేర పెంచుకోవచ్చు.