ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం... జహీర్‌ఖాన్‌కు ప్రమోషన్
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ప్లేయింగ్ బృందంలో మహేల జయవర్ధనే, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు అప్పగించింది.
ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్న మహేల జయవర్ధనేతో పాటు ప్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్‌ఖాన్‌కు ప్రమోషన్ కల్పించింది.
జహీర్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసిన యాజమాన్యం.. జయవర్ధనేకు ముంబై ఇండియన్స్ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది.
ఇదిలాఉంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్‌గా నియమితులైన తర్వాత మహేల జయవర్ధనే ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.