బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:43 IST)

ముంబై జట్టుకు తొమ్మిదో "సారీ" : లక్నో జట్టుకు అపరాధం

kl rahul
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తొమ్మిదోసారి ఓటమి పాలైంది. అదేసమయంలో ఈ మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో జట్టుకు ఎంతో సేపు మిగలలేదు. ఆ జట్టు సభ్యులందరికీ ఐపీఎల్ రిఫరీ అపరాధం విధించి షాకిచ్చింది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌‍కు రూ.24 లక్షల అపరాధం విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా మిగిలి జట్టు సభ్యులందరికీ కూడా కూడా ఫైన్ విధించారు. 
 
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్‌ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి అపరాధం విధించారు. ఈ సీజన్‌లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు. అందుకే భారీ మొత్తంలో అపరాధం విధించారు. 
 
అలాగే, ఈ మ్యాచ్‌ కోసం బరిలోకి దిగిన లక్నో జట్టు సభ్యులందరికీ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించాలని రిఫరీ అదేశించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన ఈ విడత చాలా మందికి షాకిస్తున్న విషయం తెల్సిందే. ఈ నిబంధనల మేరకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు చివరి ఓవర్ 85వ నిమిషం ముగిసేలోపు తప్పనిసరిగా పూర్తిచేయాల్సివుంది. అంతకు ఆలస్యమైతే స్లో ఓవర్ రేటు కింద జరిమానా పడుతుంది.