శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:03 IST)

వింటర్‌లో దక్షిణాది స్టైల్‌లో అతియా శెట్టి- కేఎల్ రాహుల్ వివాహం

KL Rahul
KL Rahul
టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి అతియా శెట్టిని రాహుల్ పెళ్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమలో వున్నారు. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారు. 
 
ఈ నేపథ్యంలో తమ ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నారట ఈ లవ్‌బర్డ్స్‌. ఇందులో భాగంగా త్వరలోనే వివాహ బంధంతో వీరు ఏకం కానున్నారట. 
 
అన్నీ కుదిరితే ఈ ఏడాది వింటర్‌ సీజన్‌లోనే రాహుల్- అతియాల పెళ్లి జరుగుతుందట. ఈ పెళ్లి దక్షిణాది స్టైల్‌లో జరుగనుందని టాక్ వస్తోంది. 
 
సునీల్‌ శెట్టి బాలీవుడ్‌ హీరో అయినప్పటికీ అతని పూర్వీకులు దక్షిణాదికి చెందిన వారే. ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు సునీల్‌ శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్‌ కూడా మంగళూరు ప్రాంతానికి చెందిన వాడే. 
 
ఈ క్రమంలో అతియా, రాహుల్‌ వివాహాన్ని కూడా సౌత్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ స్టైల్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ లక్నో జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు రాహుల్‌. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆజట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు. 
 
ఇక అతియా కూడా ఐపీఎల్‌‌లో సందడి చేస్తోంది. రాహుల్‌ ఆడే మ్యాచ్‌లన్నింటికీ హాజరవుతూ అతనిని ప్రోత్సహిస్తుంటుంది.