శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:31 IST)

రణబీర్-ఆలియా ప్రి-వెడ్డింగ్ వేడుకలపై కరణ్ జోహార్ ప్రత్యేక సందేశం

Alia Bhatt
బాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల ప్రి-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైన నేపధ్యంలో చిత్రనిర్మాత కరణ్ జోహార్ తన శుభాకాంక్షలు తెలిపారు. అలియా భట్- రణబీర్ కపూర్‌ల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ జంట వివాహం కోసం 'బ్రహ్మాస్త్ర' టీమ్ పూర్తిగా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 
కరణ్ జోహార్ బుధవారం 'బ్రహ్మాస్త్ర' నుండి ఒక స్నిప్పెట్‌ను పోస్ట్ చేస్తూ అలియా- రణబీర్‌ల కోసం ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. "ప్రేమ అనేది తేలికైనది. మీ ప్రేమతో మీరు ఒకరికొకరు మా జీవితాల్లోకి ఎంత వెలుగు తెచ్చారో నాకు తెలుసు. కొత్త ప్రారంభాలు మరిన్నింటికి" అని కరణ్ జోహార్ KOO యాప్‌లో పోస్ట్‌కి శీర్షిక పెట్టారు.
 
 
ఇదిలా ఉంటే, చిత్ర దర్శకుడు ఈరోజు కపూర్ ఇంటికి చేరుకోవడంతో కరణ్ జోహార్ అలియా భట్- రణబీర్ కపూర్ వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం, కరణ్ తన కారులో రణబీర్ కపూర్ బాంద్రా నివాసంలోకి వెళ్లడం కనిపించింది. ఫోటోగ్రాఫర్లు వారి ఫోటోలను తమ కెమేరాల్లో బంధించడానికి ప్రయత్నించారు.
 
 
పౌరాణిక- సైన్స్ ఫిక్షన్ కలయికతో రూపొందిన 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న ఐదు భారతీయ భాషలలో - హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. బ్రహ్మాస్త్రా తర్వాత అలియా భట్- రణవీర్ సింగ్ సరసన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు, దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్, అలియాల పెళ్లి ఆర్కే ఇంట్లో నాలుగు రోజుల పాటు జరుగనుంది. ఏప్రిల్ 15న పెళ్లి జరగనున్న నేపథ్యంలో బుధవారం నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.