మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (19:36 IST)

విషాదం మిగిల్చిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్

honey bees
తెలంగాణ రాష్ట్రంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ విషాదం మిగిల్చింది. కాబోయే వధూవరులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెంట్ మండల్ కోహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ కోసం వధూవరులు వెళ్ళారు. వీరు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్‌ ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం పొగ పెట్టారు. దీంతో తేనెటీగలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై దాడికి దిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ గృహాల్లో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.