1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (19:24 IST)

రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి సందడి.. భార్యాభర్తలుగా..

alia bhat - ranbeer
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్ 2017లో బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో కలసి పని చేశారు. అదే సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమగా మారింది. 
 
2018లో ఈ విషయాన్ని వారు అంగీకరించారు. 2020లోనే వీరిద్దరి వివాహం జరగాల్సి ఉందని.. కానీ కరోనా  కారణంగా వాయిదా పడినట్లు గతంలో రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 (గురువారం) ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకలు పూర్తయ్యాయి. గురువారం వివాహం జరుగనుంది. 
 
కపూర్ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న ఇల్లు "వాస్తు"లో అలియా, రణబీర్ వివాహం చేసుకుంటారు. వేడుక అనంతరం వీరిద్దరూ మెహందీ ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 
 
కరిష్మా కపూర్ తన కాళ్లకు మెహందీ వేసుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా.. రిద్ధిమా కపూర్ తన చేతికి వేసుకున్న మెహందీ వీడియోను షేర్ చేసింది. 
 
రణబీర్ ఆలియా వివాహం పంజాబీ సంప్రదాయం జరగనుందని తెలుస్తోంది. కేవలం కుటుంబీకులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యే ఈ వేడుక జరగనుంది.