మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:16 IST)

కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ ఐఏఎస్ మౌర్య రిసెప్షన్‌కు హాజరు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో వున్నారు. ఈ పర్యటనలో భాగంగా యువ ఐఏఎస్ అధికారిణి నారపురెడ్డి మౌర్య వివాహ రిసెప్షన్ హాజరయ్యారు. వధూవరులు మౌర్య, సత్యనారాయణరెడ్డిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మౌర్య, సత్యనారాయణరెడ్డి సీఎం జగన్ పాదాలకు నమస్కరించగా, ఆయన కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 
 
నారపురెడ్డి మౌర్య ఇటీవల నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమె భర్త సత్యనారాయణరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల మౌర్య తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను పెళ్లికి ఆహ్వానించారు. వీరి పెళ్లి ఈ నెల 14న జరిగింది. అటు, కడప మేయర్ సురేశ్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకకు కూడా సీఎం జగన్ హాజరయ్యారు.