1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM YS Jagan will tour in Nandyal District tomorrow

17న నంద్యాలలో సీఎం జగన్ పర్యటన

ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉదయం 10.15 గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. 
 
ఇక్కడ నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 
తర్వాతి కథనం
ఇక.. హిందీలో వైద్య విద్యా కోర్సు బోధన.. పుస్తకాలు విడుదల