శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (11:03 IST)

సీఎం జగన్ వైఖరి వల్లే విభజన చట్టం నీరుగారుతోంది: లక్ష్మణ్

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన చట్టం నీరుగారడానికి ప్రధాన కారణం సీఎం జగన్ వైఖరే కారణమని ధ్వజమెత్తారు. తిరుతిలో జరిగిన ప్రజాపోరు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మూడు రాజధానులంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన ప్రజాపోరు సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయని అన్నారు. ఫలితంగా అభివృద్ది మచ్చకైనా లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు.

మూడు రాజధానుల అంశంతో ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పైగా, ఏపీ వల్లే పునర్విభజన చట్టం నీరుగారిపోతోందన్నారు. ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేరకు అప్పు చేసిందన్నారు. ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయిందన్నారు. ఏపీతో పాటు తెలంగాణాలోనూ కుటుంబ పాలన సాగుతున్నాయన్నారు.

కేసీఆర్ నాలుగేళ్లుగా జాతీయ పార్టీ, జాతీయ ఫ్రంట్ పేరుతో ఉవ్విళ్ళూరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.