శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:04 IST)

ఏపీ సీఎంతో సమావేశం.. వల్లభనేని వంశీ, కొడాలి నాని గైర్హాజరు..

vallabhaneni vamsi
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, గడపగడపకు కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరు కాలేదు. 
 
ఈ సమావేశానికి నియోజక వర్గంలోని ఎమ్మెల్యేలు స్వయంగా హాజరు కావాలని సూచించారు. అయితే నాని ద్వయం హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చకు దారితీసింది. 
 
ఇకపోతే.. విజయవాడ నగరంలోని మూడు నియోజక వర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌లను అభినందించారు. అలాగే మరింత విస్తృతంగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ అన్నారు.