1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. A special flight for KCR's nationwide tour, full Deetails inside

పార్టీ కోసం ప్రత్యేక విమానం కొనుగోలు?

kcrao
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు దేశ వ్యాప్త పర్యటనల కోసం పార్టీ చార్టర్డ్ విమానాన్ని (ప్రత్యేక విమానం) కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం దాదాపు 80 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు పార్టీ సిద్ధమైంది. 12 సీట్లతో కూడిన ఈ విమానాన్ని దసరా రోజున లేదా ఆ తర్వాత ఆర్డర్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన డబ్బును సేకరించేందుకు విరాళాలను ఉపయోగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సొంతంగా విమానం ఉన్న రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యేక గౌరవం దక్కుతుంది. సొంత విమానం ఉన్న ఏకైక పార్టీగా నిలువనుంది.

మరోవైపు, దసరా రోజు (అక్టోబర్ 5) టీఆర్‌ఎస్ శాసనసభలో కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీకి కొత్త పేరును వెల్లడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తర్వాతి కథనం
అంతర్జాతీయ అనువాద దినోత్సవం 2022 నేడు.. థీమ్స్, కోట్స్ ఇవిగోండి..