మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (09:03 IST)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా : జయప్రకాష్ నారాయణ్

jayaprakash
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని లోక్‍సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయవాడలో జరిగింది. ఇందులో జేపీ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించగా, ఆయనకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. అలాగే, ఈ ఎన్నికల్లో తమతో కలిసివచ్చేవారితో కొత్త వేదికను నిర్మిస్తామని లోక్‌సత్తా నేతలు ప్రకటించారు. 
 
కాగా, జేపీ గతంలో హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు మరోమారు ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఆయన తన మనస్సులోని నిర్ణయాన్ని వెల్లడించగా, అందుకు లోక్‌‍సత్తా పార్టీ కూడా ఆమోదం తెలిపింది. 
 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాల సాధన కోసం ఏపీ నుంచి జయప్రకాష్ నారాయణ్ ఏపీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తమతో కలిసివచ్చేవారితో కొత్త కూటమిని ఏర్పాటు చేసి, కలిసి పోటీ చేస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం పరితపించే జేపీ వంటి వ్యక్తులలను ప్రజలు ఆదరించాలని లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.