శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (13:48 IST)

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జీవిత పోటీ చేస్తారా?

Jeevitha
తెలంగాణ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని నానా యాగీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఏదో కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
దీనికి తోడు కేంద్ర మంత్రులు, కీలకమైన నాయకులు తరచుగా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కూడా పూర్తయింది.
 
మరోవైపు సినీ స్టార్లతో కూడా బీజేపీ పెద్దలు సమావేశమవుతున్నారు. సినీ నటి జీవిత ఇటీవలే బీజేపీలో చేరారు. మరోవైపు జీవితకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జీవిత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.