శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (15:15 IST)

క్యూలో తొక్కిసలాట.. గాయపడ్డ మహిళ మృతి

cricket balls
భారత్-ఆస్ట్రేలియా ట్వంటీ-20 టిక్కెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాటలో  ఓ మహిళ చనిపోయింది. మహిళను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. మరో 20 మందికి గాయాలయ్యాయి.  కాగా ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 
 
అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు. క్యూలైన్ల వద్ద ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. ఇక ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.