సోమవారం, 7 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:57 IST)

జస్ప్రీత్ బుమ్రాకు తగినంత సమయమివ్వాలి : హార్దిక్ పాండ్యా

hardik pandya
భారత ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బూమ్రాకు తగినంత సమయం ఇవ్వాలని, అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయరాదని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గాయం నుంచి తిరిగి కోలుకున్న బుమ్రాకు తగిన సమయంతో పాటు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. 
 
దీనిపై పాండ్యా స్పందిస్తూ, 'బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బౌలింగ్‌పై కాస్త ఆందోళన ఉండొచ్చు. కానీ మేం మా కుర్రాళ్లను నమ్మాలి. ఈ 15 మంది దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. అందుకే జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం లోటే. అతడు చాలా ప్రభావం చూపిస్తాడు. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన అతడికి పునరాగమనానికి తగినంత సమయం ఇవ్వాలి. అతడిపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు' అని హార్దిక్ పాండ్యా తెలిపారు.