శుక్రవారం, 1 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (09:04 IST)

నిరాశపరిచిన ఐసీసీ టీ20 ర్యాంకులు.. టాప్-10లో ఇద్దరే ఇద్దరు

pak batsmans
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో భారత క్రికెటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాప్-10లో కేవలం ఇద్దరే ఇద్దరు ఆటగాళ్ళకు చోటుదక్కింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కోల్పోయాడు. ఆల్‌రౌండర్ల స్థాయనలో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 
 
మరోవైపు, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం అగ్రస్థానం కోసం పోటీపడుతున్నారు. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజా ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, ఆయన స్థానంలో పాక్‌కే చెందిన స్టార్ క్రికెటర్, భారత్‌పై నెగ్గిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. 
 
ఇక బ్యాటింగ్‌లో రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తాజా ర్యాంకుల్లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, శ్రీలంక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానానాలు ఎగబాకి 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇకపోతే, ఆల్‌రౌండర్ల స్థానంలో హార్ధిక్ పాండ్యా ఒక్కడే టాప్ 10లో ఉన్నాడు. వెరిస టాప్-10 ర్యాంకుల్లో ఇద్దరు భారతీయులు మాత్రే ఉన్నారు.