1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (08:38 IST)

మరో 5 రోజులు బెంగుళూరును ముంచెత్తనున్న భారీ వర్షాలు

rain
బెంగుళూరు నగరాన్ని భారీ వర్షథాలు ముంచెత్తనున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు బెంగుళూరు నగరం నడుం లోతు నీటిలో మునిగిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. ఇపుడు మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బెంగుళూరు వాసులు హడలిపోతున్నారు. 
 
బెంగుళూరుతో సహా కర్నాటకలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, ఎగువ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా కర్నాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆ రాష్ట్రంలోని జలాశయాలు పొంగిపోర్లుతున్నాయి. బెంగుళూరులోని పలు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో బెంగుళూరు నగర వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు.