గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (09:34 IST)

సెప్టంబరులో కుంభవృష్టే.. హెచ్చరించిన వాతావరణ శాఖ

mumbai rains
దేశంలోకి నైరుతి రుతుపవనాలు గత జూన్ నెల మొదటివారం నుంచి ప్రవేశించాయి. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్ధాయిలో వర్షపాతం నమోదైంది. అయితే, ఈ నెల 17వ తేదీ నుంచి ముందస్తు రుతుపవనాలు తిరోగమనం ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ, భారత వాతావరణ శాఖ మాత్రం అలాంటిదేమీ ఉండబోదని స్పష్టం చేస్తూనే ఈ నెలలో వర్షాలు దంచికొడుతాయని హెచ్చరించింది. దీంతోపాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైవుందని తెలిపింది.
 
సాధారణంగా జూన్ నెలలో ప్రవేశించిన నైరుతి రుతపవనాలు సెప్టెంబరు 17వ తేదీ నుంచి తిరోగమనం ప్రారంభిస్తారు. ఆపై దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలవుతుంది. కానీ, ఈ దఫా నైరుతి రుతుపవనాలు ముందే తిరోగమిస్తాయని భారత వాతావరణ విభాగం గత నెల 25వ తేదీన ప్రకటించింద. ఆ ప్రకటనకు ఇపుడు సవరణ చేసింది. 
 
ఈ నెల 17 తర్వాత నైరుతి రుతుపవనాలు ముందస్తు తిరోగమనానికి అనుకూలమైన పరిస్థితులు లేవని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజ్ మహాపాత్ర వెల్లడించారు. సెప్టెంబరునూ నైరుతి రుతుపవనాల కారణంగా గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
 
పశ్చిమ మధ్య బంగాళాతం, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని దీని ప్రభావంతో రుతపవన ద్రోణి సెప్టెంబరు 7వ తేదీకి దక్షిణ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఈ కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మహాపాత్ర వివరించారు.