బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:39 IST)

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

rain
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్నాటక వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ముఖ్యంగా, ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని పేర్కొంది. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది.