భార్య, ఆమె ప్రియుడి వేధింపుల భరించలేక భర్త ఆత్మహత్య.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సల్లెల్లలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు వేధింపుల వల్ల ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఈ గ్రామానికి చెందిన నరేశ్ అనే వ్యక్తి భార్యతో కొమిరె జంపయ్య (36) వివాహేతర సంబంధం గత రెండేళ్లుగా కొనసాగుతోంది.
ఇదే విషయంపై భార్యతో పాటు జంపయ్యను కూడా నాగేంద్ర పలు మార్లు మందలించారు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆమె తీరు మార్చుకోకపోవడంతో గ్రామ పంచాయతీ పెద్దల వద్దకు ఈ గొడవ వెళ్లింది. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేష్ ఆత్మహత్య చేసుకుంది.