శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:44 IST)

3న తెలంగాణాలో పీజీ ఈసెట్ ఫలితాలు

తెలంగాణా రాష్ట్రంలో పీజీ ఈసెట్ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. రాష్ట్రంలోని ఎంటెక్, ఎం పార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కోసం పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. 
 
శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5 తేదీల్లో రెండు సెషన్లలో, మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించింది. మొత్తం 12,592 మంది ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.