అవివేకులు ఈ చిలుక లాంటివారు...
కొబ్బరికాయలతో నిండుగా వున్న కొబ్బరి చెట్టు వంక ఆశగా చూస్తూ అప్పటికే ఆకలి బాధతో తపించిపోతున్న చిలుక ఒకటి మహదానందంగా తన వద్దనున్న చిన్న ధాన్యపు కంకితో ఎటూ ఆకలి తీరదని జారవిడిచింది.
ఒక కొబ్బరికాయను ముక్కుతో పొడవడం ప్రారంభించింది తినేద్దామని. దాని ఆకలి తీరకపోగా, దాని ముక్కు చెక్కలైంది. ఉన్నది కాస్తా పోయింది.
లోకంలో అవివేకులు కొందరు ఉన్నదానితో తృప్తి పడక తమకు అసాధ్యమైన వాటికోసం అర్రులు చాస్తుంటారు. ఆ మోజులో పడిపోయి వున్నవాటినీ పోగొట్టుకుంటారు.