గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 7 మే 2022 (20:08 IST)

అష్ట దిక్పాలురు ఎవరు, వారి వివరాలు ఏమిటి?

lord shiva - parvathi
అష్ట దిక్పాలురు అనే మాట వింటూ వుంటాము కదా. వారి పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం. తూర్పు దిక్కుకి ఇంద్రుడు దిక్పాలకుడు. ఆయన భార్య పేరు శచీదేవి, వాహనం ఐరావతం, నివాసం-అమరావతి, ఆయన ఆయుధం- వజ్రాయుధం.

 
ఆగ్నేయం దిక్కుకి అగ్ని దిక్పాలకుడు. ఆయన భార్య స్వాహాదేవి. వాహనం పొట్టేలు, నివాసం-తేజోవతి, ఆయుధం-శక్తి.

 
దక్షిణం దిక్కుకి దిక్పాలకుడు యముడు. ఆయన భార్య పేరు శ్యామల. వాహనం మహిషం. నివాసం-సంయమని, ఆయుధం-కాలపాశం.

 
నైరుతి దిక్కుకి నిరృతి దిక్పాలకుడు. ఆయన భార్య దీర్ఘాదేవి. వాహనం నరుడు. నివాసం- కృష్ణాంగన. ఆయుధం-కుంతం

 
పడమర దిక్కుకి వరుణుడు దిక్పాలకుడు. ఆయన భార్య కాళికాదేవి. వాహనం మకరం. నివాసం- శ్రద్ధావతి, ఆయుధం-పాశం.

 
వాయవ్యము దిక్కుకి వాయువు దిక్పాలకుడు. ఆయన భార్య అంజనాదేవి. వాహనం లేడి. నివాసం-గంధవతి. ఆయుధం-ధ్వజం.

 
ఉత్తరం దిక్కుకి కుబేరుడు దిక్పాలకుడు. ఆయన భార్య పేరు చిత్రలేఖ. వాహనం శ్వేతాశ్వం. నివాసం-అలకాపురం. ఆయుధం-ఖడ్గం.

 
ఈశాన్య దిక్కుకి శివుడు దిక్పాలకుడు. ఆయన భార్య పేరు పార్వతీదేవి. వాహనం వృషభం. నివాసం-కైలాసం. ఆయుధం-త్రిశూలం.