గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (12:42 IST)

ప్రజల గుండెల్లో తెరాసకు సుస్థిర స్థానం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

trsflag
తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు సుస్థిర స్థానం ఉందని ఆ రాష్ట్ర మంత్రి, తెరాస సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు బుధవారం హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు రోజుల పాటు సాగనున్నాయి. 
 
ఈ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తెరాస పార్టీ ఇంతింతై వటుడింతే అన్న చందంగా 2001 నుంచి నేటి వరకు 21 యేళ్ళుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక బలమైన సిద్ధాంత పార్టీగా పేరు గడించిందని తెలిపారు. 
 
తమ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను, విజయాలను చవిచూసిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు.