శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (16:56 IST)

అన్‌ లక్కీఫెలో క‌థ‌తో సొహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్

Clap by Praveen Sattaru
చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’ వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా  పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లక్కీ లక్ష్మణ్". 
 
ఈ చిత్రం ప్రారంభోత్సవ  పూజా కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాతలు మిరియాల రవీంద్ర రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర  స్క్రిప్ట్ అందించగా  దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్ హీరోయిన్ మోక్షలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్  గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి "లక్కీ లక్ష్మణ్" మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో
 
Lucky Laxman opening
Lucky Laxman opening
చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ.. చాలా మంది సొహైల్ సినిమా మీద సినిమా ఒప్పుకుంటున్నాడు ఏంటి అనుకోవచ్చు.అయితే నాకు కథ నచ్చితేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండాక్ సీనియర్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి లేడీ ప్రొడ్యూసర్ లు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు
 
చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, దర్శకుడు అభి ఎంతో ట్యాలెండెడ్ పర్సన్ తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఎప్పుడూ సినిమా డైలాగ్స్ చెపుతూ కథలు డిస్కషన్ చేసేవాడు. తను పడే తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా నీ కోసం నేనే సినిమా చేస్తాను మంచి కథ ఉంటే చెప్పామన్నాను. అభి చెప్పిన కథ ఫ్రెష్ గా అనిపించడంతో సినిమా నిర్మించే నిర్మాతకు ఎలాంటి బాధ్యతలు వుంటాయి.24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి ఇలా అన్ని విభాగాలను 6 మంత్స్ ఫుల్ స్టడీ చేసిన తరువాత నేను, నా ఫ్రెండ్ రమ్య ప్రభాకర్ లు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు హీరోగా ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. ఎంతో కష్టపడే  సోహైల్ అయితే ఈ సినిమాకు కరెక్ట్ అని దర్శకుడు అభి చెప్పడంతో తనను హీరోగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.మేము అడిగిన వెంటనే మా కథ విని డిఓపి అండ్రూ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడి,పాటల రచయిత భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు అన్నారు.
 
చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ...మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అయితే సొంతంగా ఒక సినిమా తీయాలని ఈ కథ రాసుకుని నిర్మాతలకు చెపుదాం అనుకున్నప్పుడు హరిత గోగినేని నాతో నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పామన్నారు. లక్కీ గా నేను చెప్పిన కథ తనక నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.అందుకే ఈ సినిమా టైటిల్‌కు లక్కీ అని పెట్టాను. ఈ టైటిల్ కూడా కథలోనుండి వచ్చిందే.. ఆ తరువాత సోహైల్‌కు ఈ కథ చెప్పగానే తను ఫస్ట్ సిట్టింగ్‌లోనే చేయడానికి ఒప్పుకున్నాడు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా తను డిఓపి అండ్రూ, అనూప్ రూబెన్స్, ప్రవీణ్ పూడి,భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్ ను తీసుకువచ్చారు. మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. "లక్కీ లక్ష్మణ్" టైటిల్‌లోనే లక్ ఉన్నట్టు సొహైల్‌కు కూడా మంచి లక్ ఉంది. అందుకే ఈమధ్య డీఫ్రెంట్ సబ్జెక్ట్స్ లను సెలెక్ట్  చేసుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న సొహైల్  తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయుస్మాన్ ఖురాన్‌లా ఎదగాలని కోరుకుంటున్నాను."లక్కీ లక్ష్మణ్" మోషన్ పోస్టర్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంది. మొదటి సారి సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 
 
డిఓపి అండ్రూ మాట్లాడుతూ.. ఎన్నో లవ్ స్టోరీలు తీసిన నేను చాలా రోజుల తరువాత మంచి లవ్ స్టొరీ ఉన్న సబ్జెక్ట్ తీస్తున్నాము.అభి చెప్పిన కథ చాలా బాగుంది. ప్రేక్షకులకు ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్ అవుతుందని అనుకుంటున్నాను అన్నారు.
 
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ తరువాత తను సినిమా మీద చేస్తున్నా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ద్వారా మహిళా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన సొహైల్ కు ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకువస్తుందని కోరుతున్నాను. లక్కీ లక్ష్మణ్ సినిమా ద్వారా హరితా గోగినేని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమవు తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
 
హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ వంటి మంచి సినిమాలో సీనియర్స్ తో కలసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు లక్కీ గా ఫీల్ అవుతున్నాను. నాకిలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్,
మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ తదితరులు