గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ నంబరు

sabita indra reddy
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు హాజరయ్యే విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు 1800 5999 333 అనే నంబరును ప్రకటించింది. దీనికి విద్యార్థులు ఫోన్ చేసి ఏదేని సలహాలు పొందవచ్చని పేర్కొంది.
 
అలాగే, ఇంటర్ పరీక్షల ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో పరీక్ష రాయాలని సూచించారు. ఏడాదంతా ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, ఇష్టంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆమె కోరారు.
 
కాగా, ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 907393 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.