గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (19:10 IST)

తెలంగాణాలో 30న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక

telangana state
తెలంగాణా రాష్ట్రంలో ఖాళీ అయిన ఒక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇటీవలే ఈ స్థానం ఖాళీ అయింది. 2018లో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండా ప్రకాశ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం ఈ నెల 12వ తేదీ ఉప ఎన్నికకు నోటిఫికేష్ జారీచేస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటిస్తారు.