శనివారం, 3 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 మే 2022 (22:30 IST)

సూర్యచంద్రులున్నంతవరకూ ఈ పాపాలు చేసిన వారిని...

మిత్ర ద్రోహం, కృతఘ్నత, విశ్వాస ఘాతుకం అనే మూడు రకాల పాపాలున్నాయి. ఇవి అత్యంత ఘోరమైన పాపాల కంటే ఘనమైనవంటే ఎలాంటివో అర్థంచేసుకోవచ్చు. స్నేహితుడిని మోసం చేయడం, చేసిన మేలు మరవడం, నమ్మించి దగా చేయడం అనే ఈ మూడు పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నదే లేదు. సూర్యచంద్రులున్నంతవరకూ ఈ పాపాలు చేసిన వారు నరకంలో పడి మగ్గుతుండవలసిందే.

 
బంధువు అనే పదానికి న్యాయం చేయగలవాడు, తమ మేలు కోరేవాడు మాత్రమే. విశ్వాసం కలవాడే స్నేహితుడనిపించుకుంటాడు. అన్నివిధాలా సుఖాన్ని ఇచ్చేది భార్య అనే పదానికి తగినది. వీటికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు నిజంగానే ఆయా స్థానాలకు అర్హులు కారు.