గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 7 మే 2022 (19:27 IST)

భార్యను అలా చూస్తే భర్త తేజస్సు హరించుకుపోతుందా?

Beauty
భార్య కంటికి కాటుక దిద్దుకుంటున్నప్పుడు భర్త ఆమెను చూడరాదని పెద్దల మాట. అలాగే భార్య తలారా స్నానం చేస్తున్నప్పుడు, నగ్నంగా వున్నప్పుడు, ప్రసవిస్తూ వున్నప్పుడు చూడరాదు. ఇవి పురుషుడి తేజస్సును హరిస్తాయని అంటారు.

 
తన భార్య అయినప్పటికీ ఆమెతో కలిసి ఒకే పాత్ర లేదా ఒకే పళ్లెంలో భోజనం చేయకూడదు. అంతేకాదు... భార్య భోజనం చేసేటపుడు, సుఖంగా కూర్చుని వున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు, కాళ్లు బారజాపి కూర్చున్నప్పుడు కూడా భర్త ఆమె వైపు చూడరాదు.