మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (13:16 IST)

మంత్రి రోజా భర్త మాటలు వినట్లేదా..? అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారా?

Roja-Selvamani
తమిళ స్టార్ హీరోలు సినిమా షూటింగులు పెట్టుకోవద్దని ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పందిస్తూ... ఏపీలో షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా భర్త చేసిన వ్యాఖ్యలు ఏపీకి నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. 
 
ఓవైపు ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తానని రోజా అంటుంటే... మరోవైపు ఆమె ప్రకటనలకు విరుద్ధంగా ఆమె భర్త మాట్లాడుతున్నారని సత్యనారాయణరాజు విమర్శించారు. వీరిద్దరి ప్రకటనల వెనుక ఉన్న తేడా దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. 
 
పరిస్థితులు చూస్తుంటే తన భర్త మాటను రోజా వినడం లేదని అనిపిస్తోందన్నారు. అందుకే ఏపీకి నష్టాన్ని చేకూర్చేలా సెల్వమణి మాట్లాడుతున్నారని చెప్పారు. భర్త చేసిన వ్యాఖ్యలకు రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.