ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు

navneet kaur
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కేసులో అరెస్టు అయిన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారికి జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన మీడియాకు గానీ, బహిరంగంగా గానీ ఎక్కడా మాట్లాడరాదని, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్ఎన్.రోఖడే షరతు విధించారు. అలాగే, కేసు విచారణ అధికారులకు ఈ దంపతులు సహకరించాలని ఆదేశించారు. 
 
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆందోళనకు చేశారు. ఇది ముంబైలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ పోలీసులు ఈ దంపతులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు బెయిల్ కోసం ప్రయత్నించగా, బుధవారం వారికి బెయిల్ మంజూరైంది.