శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (08:57 IST)

టీడీపీలోకి గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి.. జగన్ పట్టించుకోకపోవడంతోనే..?

తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత, తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 
 
ఆయనతో పాటు అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడిగా కొండ్రెడ్డి ఉండగా...ఆయన భార్య తంబళ్లపల్లె మండల జడ్పీటీసీగా ఉన్నారు. 
 
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, కొండ్రెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి. తనకు వైసీపీలో జరుగుతున్న అన్యాయం, కక్ష సాధింపుల విషయమై అప్పట్లో కొండ్రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. కొండ్రెడ్డిని కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు.